schedule Sunday, September 13, 2026

పసారి వార్డులో లడ్డూ వేలం రికార్డు

calendar_today September 11, 2024
person dharshininews
పసారి వార్డులో లడ్డూ వేలం రికార్డు
పసారి వార్డులో లడ్డూ వేలం రికార్డు - రూ. 1లక్ష 12వేల 151కి వేలం - భక్తున్ని సన్మానించిన ఉత్సవ సమితి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని పసారి వార్డులో వినాయక లడ్డూ వేలం రికార్డుకు పలికింది. బుధవారం వినాయక నిమజ్జనం సందర్బంగా శ్రీ మణికంఠ వినాయక ఉత్సవ సమితి ఆధ్వర్యంలో లడ్డూవేలం నిర్వహించారు. ఐదు రోజుల పాటు పూజలందుకున్న వినాయక లడ్డూను దక్కించుకునేందుకు భక్తులు పోటీ పడ్డారు. వేలల్లో మొదలైన లడ్డూ వేలం లక్షల్లో ముగిసింది. స్థానికంగా ఉన్న కందూరి నాగరాజు పేరుతో వారి కుటుంబ సభ్యులు రూ. 1లక్ష 12వేల 151లకు సొంతం చేసుకున్నారు. లడ్డూను దక్కించుకున్న భక్తున్ని ఉత్సవ సమితి సభ్యులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ సమితి అధ్యక్ష, కార్యదర్శులు, సభ్యులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి.. https://www.dharshininews.com/28947/