అంబులెన్స్‌లో గర్భిణీ ప్రసవం
September 12, 2024
dharshininews
అంబులెన్స్‌లో గర్భిణీ ప్రసవం
- కవల శిశువులకు జననం
- ఆసుపత్రిలో చేరిన తల్లీ, బిడ్డా క్షేమం
తాండూరు, దర్శిని ప్రతినిధి : అంబులెన్స్‌లో ఓ గర్భిణీ ప్రసవం జరిగింది. ఇద్దరు కవల శిశువులకు జన్మనిచ్చింది. ఈ సంఘటన గురువారం జరిగింది. కుల్కచర్ల మండలం ముజాయిదిపూర్ గ్రామానికి చెందిన చంద్రకళ అనే మహిళ 5వ కాన్పుకోసం తాండూరులోని జిల్లా మాతాశిశు ఆసుపత్రికి వచ్చింది. ప్రసవ పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో హైదరాబాద్‌లోని నిలోఫర్‌కు రిఫర్ చేశారు. బషీరాబాద్‌కు చెందిన అంబులెన్స్‌లో తరిలిస్తుండగా ధారూర్ సమీపంలోకి రాగానే పురిటినొప్పులు అధికం కావడంతో అంబులెన్స్ ఈఎంటీ శాంతు కుమార్ చంద్రకళకు కాన్సు చేశారు.
ఈ కాన్పులో ఆమె ఒక మగ, ఒక ఆడ శిశువు ఇద్దరు కవలకు జన్మనిచ్చింది. అనంతరం ఆమెను వికారాబాద్‌లోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లీ పిల్లలు క్షేమంగా ఉన్నట్లు అంబులెన్స్ పైలెట్ శివకుమార్ తెలిపారు.
ఇదికూడా చదవండి..
https://www.dharshininews.com/28974/