schedule Friday, September 11, 2026

ఆసుపత్రిలో చేరిన ఏఎంసీ చైర్మన్

calendar_today September 12, 2024
person dharshininews
ఆసుపత్రిలో చేరిన ఏఎంసీ చైర్మన్
ఆసుపత్రిలో చేరిన ఏఎంసీ చైర్మన్ - సాయిపూర్ బాల్‌ రెడ్డికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పరామర్శ - కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితి ఆరా తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్ సాయిపూర్ పట్లోళ్ల బాల్ రెడ్డి ఆసుపత్రిలో చేరారు. మంగళవారం రాత్రి సాయిపూర్ బాల్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. హైటెక్ సీటీలోని యశోధ ఆసుపత్రిలో చికిత్స పొందున్నారు. గురువారం తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆసుపత్రికి చేరుకుని చికిత్స పొందుతున్న సాయిపూర్ బాల్ రెడ్డిని పరామర్శించారు. ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మనోనిబ్బరం కోల్పోకుండా ధైర్యంగా కోలుకోవాలని బాల్ రెడ్డికి దైర్యం చెప్పారు. కుటుంబ సభ్యులకు మనోధైర్యం అందించారు. ఆసుపత్రిలో బాల్ రెడ్డి సతీమణి, కౌన్సిలర్ నీరజాబాల్ రెడ్డి, పార్టీ నేతలు ఉన్నారు. ఇదికూడా చదవండి.. https://www.dharshininews.com/28962/