schedule Tuesday, July 07, 2026

వక్స్ బోర్డు భూములను కాపాడుకోవడమే ధ్యేయం

calendar_today September 12, 2024
person dharshininews
వక్స్ బోర్డు భూములను కాపాడుకోవడమే ధ్యేయం
వక్స్ బోర్డు భూములను కాపాడుకోవడమే ధ్యేయం - ఎమ్మెల్సీ అమీర్ అలీఖాన్ - ముస్లిం వెల్పేర్ అసోసియేషన్ సమావేశం తాండూరు, దర్శిని ప్రతినిధి : వక్స్ బోర్డుకు సంబంధించిన భూములను కాపాడుకోవడమే ధ్యేయంగా ముందుకు సాగాలని ఎమ్మెల్సీ అమీర్ అలీఖాన్ అన్నారు. గురువారం తాండూరు ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టనంలోని సమద్ ఫంక్షన్ హాల్ లో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ అమీర్ అలీఖాన్ మాట్లాడుతూ ముస్లిం సోదరులు వక్స్ బోర్డు భూముల పరిరక్షణకు అందరు ఐక్యంగా ఉండాలన్నారు. ఇప్పటికే ఎన్ ఆర్ సీసీఏఏ వంటి బిల్లులను వ్యతిరేకించడం జరిగిందన్నారు. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లోని వక్స్ బోర్డు భూములను కాపాడుకోవడం మన బాధ్యత అన్నారు. తాండూరులో తిర్మానించిన బిల్లును కూడా పార్లమెంట్లో చర్చించేలా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు కమల్ అతహర్, మాజీ అధ్యక్షులు అబ్దుల్ అహద్, ఎండీ బాబర్, నాయకులు అబ్దుల్ రవూఫ్, మాజీ కౌన్సిలర్లు అలీం, జుబేర్ లాల, కౌన్సిరల్ అబ్దుల్ రజాక్, అసోసియేషన్ ఉపాధ్యక్షులు అబ్దుల్ బాసిత్ అలీ, సెక్రటరీ ఖాలీద్ సైఫ్ వుల్లా, జాయింట్ సెక్రటరీ యూనుస్, ఖయ్యూం అతహర్, సుహేల్ ఉమారి, ఖయ్యూం, షుకూర్ ఖాన్, ఇంతియాజ్ బాబా, ఎండీ సిరాజ్, మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి.. https://www.dharshininews.com/28986/