schedule Friday, September 11, 2026

రేపు తాండూరులో పవర్ కట్

calendar_today September 13, 2024
person dharshininews
రేపు తాండూరులో పవర్ కట్
రేపు తాండూరులో పవర్ కట్ - ప్రకటించిన విద్యుత్ అధికారులు తాండూరు, దర్శిని ప్రతినిధి : రేపు తాండూరులో విద్యుత్ సరఫరాలో అంతరాయం విధిస్తున్నట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. తాండూరు మండలంలోని విద్యుత్ సబ్‌ స్టేషన్‌ పరిధిలో మరమ్మత్తుల కారణంగా విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు మండల విద్యుత్ ఏఈ వెంకట్ నాయుడు వెల్లడించారు. శనివారం ఉదయం 9 గంటల నుంచి 11 గంటలకు మండలంలోని అన్ని గ్రామాల్లో విద్యుత్ జరఫరా జరగదని స్పష్టం చేవారు. విద్యుత్ అంతరాయానికి అన్ని గ్రామాల్లోని విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు. మరమ్మత్తులు పూర్తయిన తరువాత యధావిధిగా విద్యుత్ సరఫరా ఉంటుందని తెలిపారు. ఇదికూడా చదవండి.. https://www.dharshininews.com/29013/