schedule Tuesday, July 07, 2026

రాష్ట్ర నేతలను కలిసిన తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి

calendar_today September 14, 2024
person dharshininews
రాష్ట్ర నేతలను కలిసిన తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
రాష్ట్ర నేతలను కలిసిన తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి - పోచారం శ్రీనివాస్ రెడ్డి, కే.కేశవరావులతో భేటి - టీపీసీసీ కొత్త అధ్యక్షులు మహేష్ గౌడ్‌కు శుభకాంక్షలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర నాయకులతో తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి భేటీ అయ్యారు. శనివారం తెలంగాణ ప్రభుత్వ సలహాదారులుగా నియామకమైన కేశవరావు, రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహదారులుగా చేసిన పోచారం శ్రీనివాస్ రెడ్డిలు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్బంగా హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మీ, ఇతర నేతలతో కలిసి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి వారితో భేటి అయ్యి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ నియామకమైన సందర్భంగా ఆయనను కూడా కలిసి తాండూరు నియోజకవర్గ నాయకులతో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే వెంట డీసీసీబీ వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ధారాసింగ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వడ్డె శ్రీనివాస్, యాలాల పీఏసీఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డి, నాయకులు అజయ్ ప్రసాద్, భీమయ్య, మసూద్, సర్దార్ ఖాన్, లొంక నర్సింలు, జిల్లా మహిళ నాయకురాలు శోభారాణి, గురురాజ్ జోషి తదితరులు ఉన్నారు. ఇదికూడా చదవండి.. https://www.dharshininews.com/29067/