schedule Friday, September 11, 2026

దేవాలయాల పాలకమండళ్లకు గ్రీన్ సిగ్నల్..!

calendar_today September 14, 2024
person dharshininews
దేవాలయాల పాలకమండళ్లకు గ్రీన్ సిగ్నల్..!
దేవాలయాల పాలకమండళ్లకు గ్రీన్ సిగ్నల్..! - తాండూరు మండలంలో మూడు, బషీరాబాద్‌లో ఒకదానికి నోటిఫికేషన్ - దస్తగిరిపేట్ వెంకటేశ్వర స్వామి, చండ్రవంచ, చెనిగెష్‌పూర్‌ దరఖాస్తులు తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి: తాండూరు నియోజకవర్గంలోని తాండూరు, బషీరాబాద్ మండలంలోని పలు దేవాలయాల పాలకమండళ్ల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు దేవాదాయ ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమీషనర్ డి.కృష్ణ ప్రసాద్ ఆదేశాలతో నోటిపికేషన్ జారీ అయ్యింది. తాండూరు మండలం అంతారం అనుబంధ గ్రామం దస్తగిరిపేట్ లోని శ్రీ శ్రీదేవి భూదేవీ శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంతో పాటు చంద్రవంచలోని హనుమాన్ దేవాలయం, చెనిగేష్ పూర్ లోని హనుమాన్ దేవాలయాలకు నోటిఫికేషన్ విడుదలైంది. అదేవిధంగా బషీరాబాద్ మండలం క్యాద్దిరాలోని శ్రీమారుతి దేవాలయం ట్రస్టు బోర్డు ఏర్పాటుకు కూడా నోటిఫికేషన్ జారీ అయ్యింది. నోటిఫికేషన్ జారీ అయిన 20 రోజుల్లోపు సెక్షన్-17లోని సబ్ సెక్షన్-3 ప్రకారం దరఖాస్తులను కోరడం జరుగుతుందని నోటిఫికేషన్ లో స్పష్టం చేశారు. పూర్తి వివరాలకు తాండూరు భద్రేశ్వర దేవాలయ ఈఓ శేఖర్ గౌడ్ ను సంప్రదించాలని సూచించారు. ఇదికూడా చదవండి.. https://www.dharshininews.com/29073/