schedule Tuesday, July 07, 2026

గుంతల రోడ్డుకు తాత్కాళిక మోక్షం

calendar_today September 16, 2024
person dharshininews
గుంతల రోడ్డుకు తాత్కాళిక మోక్షం
గుంతల రోడ్డుకు తాత్కాళిక మోక్షం - ఆర్బీఓఎల్ శ్రీనన్న చొరవతో గుంతల పూడిక - సొంత ఖర్చులతో మరమ్మత్తుల పనులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గం యాలాల మండలంలోని రోడ్డుపై ఏర్పడిన గుంతల నుంచి వాహనదారులకు తాత్కాళిక మోక్షం లభించింది. తాండూరు కాంగ్రెస్ నాయకులు, ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి చొరవతో గుంతల పూడిక పనులు శరవేగంగా జరిగాయి. మండలంలోని లక్ష్మీనారాయణపూర్ గ్రామం నుండి మండల కేంద్రము వరకు ఉన్న ప్రధాన రోడ్డు ఇటీవలే కురిసిన అకాల వర్షాల వల్ల రోడ్లు గుంతలమయంగా మారింది. అడుగుకో గుంత ఏర్పడిన రోడ్డుపై ప్రయాణానికి వాహనదారులు నరక యాతన పడుతున్నారు. ప్రమాదకరంగా మారిన ఇట్టి రోడ్లను యుద్ధ ప్రాతిపదికన రోడ్ల పై గుంతలు పూడ్చేందుకు శ్రీనివాస్ రెడ్డి చొరవచూపారు. సోమవారం తన సంస్థకు చెందిన జేసీబీ యంత్రం సహాయంతో రోడ్లపై ఏర్పడిన గుంతలను మరమ్మత్తులు చేయించారు. దీంతో గుంతల రోడ్డుకు తాత్కాళిక మోక్షం లభించింది. గుంతల వల్ల ఇబ్బందులు పడ్డ ప్రయాణికులు తాత్కాళిక మరమ్మత్తులతో కాస్త ఉపశమనం పొందారు. ఈ సమస్య పరిష్కారానికి చొరవ చూపిన శ్రీనివాస్ రెడ్డి చేయూతపై హర్షం వ్యక్తం చేశారు. మరోవైపు రోడ్డును పూర్తిస్థాయిలో అభివృద్ధి పరిచేందుకు తమవంతు కృసి చేస్తామని శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/29135/