schedule Tuesday, July 07, 2026

కేంద్ర ప్రభుత్వాలు పేదలకు వరం

calendar_today September 17, 2024
person dharshininews
కేంద్ర ప్రభుత్వాలు పేదలకు వరం
కేంద్ర ప్రభుత్వాలు పేదలకు వరం - మున్సిపల్ కౌన్సిలర్ సాహు శ్రీలత లక్ష్మీకాంత్ - మోడి జన్మదినం సందర్భంగా పథకాలపై అవగాహన - పథకాల్లో లబ్దిదారుల నమోదు తాండూరు, దర్శిని ప్రతినిధి : కేంద్ర ప్రభుత్వ పథకాలు పేదలకు వరంగా నిలుస్తాయని తాండూరు మున్సిపల్ కౌన్సిలర్ సాహు శ్రీలత లక్ష్మీకాంత్ అన్నారు. మంగళవారం ప్రధాని మోడి జన్మదినం సందర్భంగా పట్టణంలోని తన వార్డుతో పాటు ప్రజలలకు కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించారు. అదేవిధంగా మోడీ ప్రవేశ పెట్టిన ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి, ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన తదితర పథకాలకు అర్హులైన వారి చేత చేర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశంలో మోడి ఆధ్వర్యంలో సంక్షేమ పాలన అందుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలపై అందరు అవగాహన పెంచుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు పేద లబ్దిదారులందరికి వరంగా, ఆపద సమయాల్లో అండగా నిలుస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/29164/