schedule Tuesday, July 07, 2026

ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజావాణి

calendar_today September 23, 2024
person dharshininews
ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజావాణి
ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజావాణి - అందరూ సద్వినియోగం చేసుకోవాలి - తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ అన్నారు. సోమవారం తాండూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో డివిజన్ స్థాయి ప్రజావాణి కార్యక్రమం ఏర్పాటు చేశారు. సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ ప్రజావాణి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రజావాణి కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. డివిజన్ స్థాయిలో సమస్యలు ఉన్న ప్రజలు, పేదలు ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిలో దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మరోవైపు ప్రజావాణిలో మొత్తం 19 దరఖాస్తులు రాగా సంబంధిత శాఖల అధికారులు పరిష్కరించేలా చూడాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్, రెవెన్యూ, ఇరిగేషన్ తదితర శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఇదికూడా చదవండి.... https://www.dharshininews.com/29297/