schedule Friday, September 11, 2026

టీపీసీసీ అధ్యక్షులను కలిసిన వీఎన్ గౌడ్

calendar_today September 23, 2024
person dharshininews
టీపీసీసీ అధ్యక్షులను కలిసిన వీఎన్ గౌడ్
టీపీసీసీ అధ్యక్షులను కలిసిన వీఎన్ గౌడ్ - మహేష్ గౌడ్ ను కలిసి శుభకాంక్షలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ పీసీసీ అధ్యక్షులు మహేష్ గౌడ్ ను తాండూరు మున్సిపల్ మాజీ చైర్మన్ ఏ. విశ్వనాథ్ గౌడ్(వీఎన్ గౌడ్) కలిశారు. సోమవారం హైదరాబాద్ లో మహేష్ గౌడ్ తో విశ్వనాథ్ గౌడ్ ఆయన కుమారుడు సోమనాథ్ గౌడ్ తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షులుగా నియామకం, బాధ్యతలు చేపట్టిన సందర్బంగా శాలువాతో సన్మానించి, పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీలో చురు కైన పాత్ర పోషిస్తూ కార్యకర్త స్థాయి నుంచి అధ్యక్ష పదవి చేపట్టే దాకా ఎదగడం సంతోషకరమన్నారు. ఇదికూడా చదవండి.... https://www.dharshininews.com/29303/