schedule Friday, September 11, 2026

కురువల ఐక్యతకు తోడ్పడాలి

calendar_today September 23, 2024
person dharshininews
కురువల ఐక్యతకు తోడ్పడాలి
కురువల ఐక్యతకు తోడ్పడాలి - తాండూరు మండల నూతన కార్యవర్గం ఎన్నిక - నాగారం నర్సింలును కలిసిన కార్యవర్గం తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : కురువల ఐక్యతకు అందరు తోడ్పాటు అందించాలని తాండూరు నియోజకవర్గ కురువ సంఘం నాయకులు అన్నారు. సోమవారం తాండూరు నియోజకవర్గ సంఘం అధ్యక్షులు నాగారం జగదీశ్వర్, ఉపాధ్యక్షులు పూజారి పాండు, ప్రధాన కార్యదర్శి ఇందూరు మల్లేశంల ఆధ్వర్యంలో తాండూరు మండల సంఘం కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. మండల గౌరవాధ్యక్షులుగా చీమల నర్సింలు, అధ్యక్షులుగా జినుగుర్తి నర్సింలు, కార్యదర్శిగా ఉల్లి నర్సింలు, సహాయ కార్యదర్శిగా చిట్టిగణాపూర్ కె.రాజు, కోశాధికారిగా అయినెల్లి దస్తప్ప, పెద్దేముల్ మండల అధ్యక్షులుగా గొ పాలకృష్ణను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కురువలు ఐక్యంగా ఉండాలన్నారు. హక్కుల సాధనకు నిరంతరం పోరాటం చేయాలన్నారు. అందరి తోడ్పాడుతోనే కురువల అభ్యున్నతి సాధిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం తాండూరు పట్టణ అధ్యక్షులు మారాఠీ నర్సింలు, సీనీయర్ నాయకులు జన్నె నాగప్ప, హనుమయ్య సార్, ఒగ్గు కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షులు గొట్లపల్లి మల్లప్ప, చెంగోల్ రాము తదితరులు ఉన్నారు. మరోవైపు తాండూరు మండల నూతన కమిటి సభ్యులు తాండూరు మున్సిపల్ మాజీ చైర్మన్, కురువ సంఘం నాయకులు నాగారం నర్సింలును మర్యాద పూర్వకంగా కలిసి శాలువా, పుష్పగుచ్చంతో సన్మానించారు. అనంతరం ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/29306/