schedule Tuesday, July 07, 2026

ఇంట్లోనే మూడు రోజుల మృతదేహం..!

calendar_today September 24, 2024
person dharshininews
ఇంట్లోనే మూడు రోజుల మృతదేహం..!
ఇంట్లోనే మూడు రోజుల మృతదేహం..! - దుర్వాసనతో గమనించిన స్థానికులు - తాండూరు ఇందిరమ్మ కాలనీలో ఘోరం తాండూరు, దర్శిని ప్రతినిధి : ఒంటరిగా ఉన్న ఓ వ్యక్తి ఇంట్లోనే మృతి చెందాడు. దాదాపు మూడు రోజులుగా ఇంట్లోనే మృతదేహం ఉండిపోయింది. దుర్వాసన వల్ల స్థానికులు గమనించడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. స్థానికులు తెలిపిన ప్రాథమిక వివరాలిలా ఉన్నాయి.తాండూరు పట్టణం హైదరాబాద్ రోడ్డు మార్గంలోని ఇందిరమ్మ కాలనీలో అలీ(34) అనే వ్యక్తి నివసిస్తున్నాడు. భార్య వేరే చోట కాపురం ఉంటుండడంతో ఇంట్లో ఒంటరిగా ఉంటున్నట్లు సమాచారం. గత మూడు రోజుల క్రితం ఇంట్లో తాళం వేసుకుని నిద్రపోయాడు. మూడు రోజుల తరువాత అతని ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో అనుమానం వచ్చి గమనించారు. అప్పటికే అలీ చనిపోవడంతో మృతదేహం కుల్లిపోయింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న యాలాల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అయితే అలీ మూడు రోజుల క్రితం నిద్రలోనే మృతి చెందినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తేలనున్నాయి. ఇంట్లోనే మూడు రోజులుగా మృతదేహంగా ఉన్న అలీ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/29331/