schedule Tuesday, July 07, 2026

ఐటీఐ కాలేజీ పిలుస్తోంది..!

calendar_today September 26, 2024
person dharshininews
ఐటీఐ కాలేజీ పిలుస్తోంది..!
ఐటీఐ కాలేజీ పిలుస్తోంది..! - ప్రభుత్వ, ప్రైవేటే కోర్టులకు ఆహ్వానం - వికారాబాద్‌ జిల్లా వాసులకు అవకాశం - పది, ఎనిమిదో తరగతి పాసైతే చాలు వికారాబాద్‌, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లాలోని విద్యార్థులకు ప్రభుత్వ ఐటీఐ కాలేజీ కీలక సూచన చేసింది. కాలేజీలో ప్రభుత్వ, ప్రైవేటు కోర్సుల కోసం అసక్తిగల విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ మేరకు వికారాబాద్ ప్రభుత్వ ఐటీఐ కాలేజీ ప్రిన్సిపల్ ఆర్.నరేంద్రబాబు ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు కోర్సులలో ఐదవ విడత కింద మిగిలిన సీట్లను భర్తి చేసేందుకు దరఖాస్తులను కోరడం జరుగుతుందని వెల్లడించారు. పదో తరగతితో పాటు ఎనిమిదవ తరగతి ఉత్తీర్ణులై విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. 2024 ఆగస్టు 1వ తేది నాటికి 14 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉండాలని, అపై ఏ వయస్సు వారైనా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఇదివరకు దరఖాస్తులు చేసుకున్న వారు మళ్లీ చేయాల్సిన పనిలేదని స్పష్టం చేశారు. కొత్తగా దరఖాస్తు చేసే వారు ప్రభుత్వ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలన్నారు. ఈనెల 28వ తేది ఉదయం 11 గంటలలోపు http://iti.telangana.gov.in వెబ్ సైట్‌లో అన్ని వర్జినల్ సర్టిఫికెట్లు స్కాన్ చేసి వెబ్సైట్లో అప్లోడ్ చెయ్యాలని సూచించారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థుకు మధ్యాహ్నం కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుందని, దీనికి విద్యార్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాల్సి ఉంటుందని సూచించారు. మెరిట్‌ ఆధారాంగా సీట్ల కేటాయింపు ఉంటుందని, పూర్తి వివరాలకు సెల్: 9177472488, 8555865421 9177954208లకు సంప్రదించాలని తెలిపారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/29366/