schedule Friday, September 11, 2026

విఠల్ నాయక్ గొప్ప మనసు..!

calendar_today October 2, 2024
person dharshininews
విఠల్ నాయక్ గొప్ప మనసు..!
విఠల్ నాయక్ గొప్ప మనసు..! - నవరాత్రి ఉత్సవాలకు తోడ్పాటు - రూ.40వేల విరాళం అందజేత తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, వినాయక అవుట్ సోర్సింగ్ వ్యవస్థాపకులు విఠల్ నాయక్ గొప్ప మనసును చాటుకున్నారు. తాండూరు పట్టణంలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో ప్రతి యేడాది దేవీ నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తన్నారు. ఈ యేడాది జరిగే ఉత్సవాల నిర్వహణ కోసం కమిటి సభ్యులు విఠల్ నాయక్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. నవరాత్రి ఉత్సవాల కోసం విఠల్ నాయక్ కమిటి సభ్యులకు రూ.40వేలను చెక్కు రూపంలో విరాళంగా అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేవీ నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని, ఆసుపత్రికి వచ్చే రోగులకు అంతా మంచే జరగాలని ప్రార్థించారు. అదేవిధంగా జిల్లా ఆసుపత్రికి కాయకల్ప అవార్డు రావడం పట్ల ఆసుపత్రి సూపరిండెంట్ డా.రవిశంకర్, డీసీహెచ్ఎస్ ప్రదీప్ కుమార్ సిబ్బంది తరుపున శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది, కమిటి సభ్యులు ఉన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/29491/