schedule Friday, September 11, 2026

మహాత్ముని త్యాగం మరువలేం..!

calendar_today October 2, 2024
person dharshininews
మహాత్ముని త్యాగం మరువలేం..!
మహాత్ముని త్యాగం మరువలేం..! - తాండూరు బీఆర్ఎస్ నేతలు - గాంధీ విగ్రహానికి నివాళులు తాండూరు, దర్శిని ప్రతినిధి : దేశ స్వాతంత్రం కోసం మహాత్మ గాంధీ చేసిన త్యాగాలను, కృషిని ఎవ్వరు మరువలేరని తాండూరు బీఆర్ఎస్ నేతలు అన్నారు. బుధవారం పట్టణంలోని గాంధీ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గాంధీ జయంతిని జరుపుకున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నరుకుల నరేందర్ గౌడ్, సీనీయర్ నాయకులు పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాస్ చారి, మైనార్టీ పట్టణ అధ్యక్షులు యూనుస్, కౌన్సిలర్ ముక్తార్ నాజ్, రాజన్ గౌడ్, కరుణాకర్ తదితరులు గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గాంధీ చూపిన మార్గంతోనే దేశానికి స్వాతంత్ర్యం సాధించుకున్నామని అన్నారు. ఆయన మార్గం, త్యాగం, కృషి ఎన్నటికి మరువలేదని అన్నారు. గాంధీజీ ఆశయ సాధనకు అందరు కృషి చేయాలని అన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/29500/