schedule Tuesday, July 07, 2026

తాండూరులో గంజాయి చాక్లెట్లు..!

calendar_today October 2, 2024
person dharshininews
తాండూరులో గంజాయి చాక్లెట్లు..!
తాండూరులో గంజాయి చాక్లెట్లు..! - ఎండు గంజాయి పౌడర్ విక్రయాలు - ఒడిషా నిందితుని నుంచి స్వాదీనం - పట్టుకున్న ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లా తాండూరులో గుట్టుగా గంజాయి చాక్లెట్లు, ఎండు గంజాయి పౌడర్‌ విక్రయాలు జరుగుతున్నట్లు ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడుల్లో కలకలం రేపింది. వాహనాల పార్కింగ్, ఇతర ప్రదేశాల్లో విక్రయాలు జరుగుతున్నట్లు తెలిసింది. మధ్య నిషేధ మరియు అబ్కారీ అధికారి కే. విజయభాస్కర్ ఆదేశాల మేరకు అసిస్టెంట్ ఎక్సైజ్ సూపర్డెంట్ ఎస్. శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా ఎక్సైజ్ టాస్క్‌ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. తాండూరులో ఓడిషా రాష్ట్రం పూరీ తాలూకాకు చెందిన అనిల్ కుమార్ దాస్ అనే వ్యక్తి గంజాయి చాక్లెట్లు, ఎండు గంజాయి పౌడర్ విక్రయాలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందింది. ఈ మేరకు వికారాబాద్ జిల్లా ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ బృందం దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 400గ్రాముల గంజాయి చాక్లెట్లు, 1.9 కేజీల ఎండిన గంజాయి పౌడర్‌లను స్వాదీనం చేసుకున్నారు. ఈ మేరకు నిందితునిపై కేసు నమోదు చేసి రిమాండుకు తరలించినట్లు టాస్క్ ఫోర్స్ సీఐ కే. శ్రీనివాస్ తెలిపినారు. ఈ దాడులలో ఎస్సైలూ బి.ప్రేమ్ కుమార్ రెడ్డి, సిబ్బంది విష్ణువర్ధన్ రెడ్డి, శివ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/29506/