schedule Tuesday, July 07, 2026

నమో వాసవీ మాత..!

calendar_today October 5, 2024
person dharshininews
నమో వాసవీ మాత..!
నమో వాసవీ మాత..! - అమ్మవారికి భక్తితో పూజలు - నగరేశ్వరాలయంలో శరన్నవరాత్రుల శోభ తాండూరు, దర్శిని ప్రతినిధి : నమో వాసవీ మాత అంటూ ఆర్యవైశ్య భక్తులు కన్యకా పరమేశ్వరీని కొలిచారు. వాసవీ మహిళ సంఘం ఆధ్వర్యంలో తాండూరు పట్టణంలోని నగరేశ్వర దేవాలయంలో శరన్నవరాత్రుల ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ప్రతి రోజూ అమ్మవారికి పూజా కార్యక్రమాలతో శోభ సంతరించుకుంటుంది. శనివారం ఆలయ కమిటి, సంఘం అధ్యక్షురాలు కోట్రిక నాగలక్ష్మీ శ్రీకాంత్ ఆధ్వర్యంలో వాసవీ మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మూడవరోజు గాయత్రి దేవిగా దర్శనం ఇచ్చిన అమ్మవారికి కుంకుమార్చన, మంగళహారతి కార్యక్రమాలను భక్తిశ్రద్దలతో నిర్వహించారు. మమ్మేలూ మా మాత అంటూ అమ్మవారిని వేడుకున్నారు. భక్తులు అమ్మవారిని కీర్తిస్తూ భజన కీర్తనలను ఆలాపించారు. జై వాసవీ మాతా.. జైజై వాసవీమాత నినాదాలతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షురాలు గుబ్బ ప్రగతి, ప్రధాన కార్యదర్శురాలు మంకాల స్వప్న, ఉప కార్యదర్శురాలు తాళ్లపల్లి కవిత, కోశాధికారి సంగంశెట్టి శోభ, కార్యవర్గ సభ్యులు గుముడాల దీప, ముదేళ్లి శశిరేఖ, కల్వ అర్చన, లగిశెట్టి సంధ్య, ఆకుల లావణ్య, బిక్కుమాండ్ల శ్రీదేవి, దాదాపురం కవిత, వేముల దివ్య, కోట్రిక రజని, ఎదిరే సంతోషి, చిద్రి వీణ, కటకం పద్మజ, రేపాల పద్మ, కోట దీప, పూసల భాగ్యలక్ష్మీ, కౌకుంట్ల ప్రసన్న, బచ్చు సుధారాణి, కోడూరు జయశ్రీ, తర్లపల్లి శ్రీవాణి, కోడూరు విజయలక్ష్మీ, సలహదారులు లగిశెట్టి ప్రభావతి, మంతటి శంకరమ్మ, అయినాపురం అనిత, ముదేళ్లి సంగీత, కల్వ సరిత, ఆలయ కమిటి సభ్యులు, ఆర్యవైశ్య సంఘం నాయకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/29547/