schedule Tuesday, July 07, 2026

పట్టణాభివృద్ధికి కృషి

calendar_today October 6, 2024
person dharshininews
పట్టణాభివృద్ధికి కృషి
పట్టణాభివృద్ధికి కృషి - మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ - 11వ వార్డులో సైడ్ డ్రైన్ పనుల ప్రారంభం తాండూరు, దర్శిని ప్రతినిధి : పట్టణ అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ అన్నారు. ఆదివారం పట్టణంలోని 11వ వార్డులో సైడ్ డ్రైన్ పనులను చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ హాజరై వార్డు కౌన్సిలర్ పట్లోళ్ల నీరజా బాల్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టణంలోని అన్ని వార్డులలో పార్టీలకతీతంగా అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందని అన్నారు. వార్డుల్లో సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బంటు మల్లప్ప, యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు బంటు వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/29571/