schedule Tuesday, July 07, 2026

ధరణి సమస్యల పరిష్కారానికి చర్యలు

calendar_today October 7, 2024
person dharshininews
ధరణి సమస్యల పరిష్కారానికి చర్యలు
ధరణి సమస్యల పరిష్కారానికి చర్యలు - తాండూరు సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్ - ప్రజావాణిలో 18 దరఖాస్తులు తాండూరు, దర్శిని ప్రతినిధి : ధరణిలో భూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని తాండూరు సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్ అన్నారు. సోమవారం తాండూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో డివిజన్ స్థాయి ప్రజావాణి కార్యక్రమం జరిగింది. ఈ ప్రజావాణిలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఫిర్యాదులు చేసుకున్నారు. సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్ ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ధరణికి సంబంధించి 6 ఫిర్యాదులు, మున్సిపల్ కు సంబంధించి - 1, సర్వే కోసం - 2, పశుసంవర్ధక శాఖకు - 1, భూముల కేటాయింపుకు- 7, భూ సేకరణ కోసం - 1 ధరఖాస్తులు అందాయి. ఇందులో తాండూరు మండలం అంతారం గ్రామానికి చెందిన ఎస్సీలు తమకు స్మశాన వాటిక లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు భూసేకరణకు చర్యలు తీసుకుంటామని సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ తెలిపారు. అదేవిధంగా ధరణి సమస్యల పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని, ప్రజావాణిలో అందిన ఫిర్యాదులను పరిష్కరించాలని అన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/29588/