తాండూరులో లారీల బంద్..!
October 7, 2024
dharshininews
తాండూరులో లారీల బంద్..!
- లారీ ఓనర్స్ వెల్పేర్ అసోసియేషన్ నిర్ణయం
- డిమాండ్లు ప్రకటించిన అసోసియేషన్
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూరులో మంగళవారం నుంచి లారీ బంద్ చేపడుతున్నట్లు స్థానిక లారీ ఓనర్స్ వెల్పేర్ అసోసియేషన్ సభ్యులు ప్రకటించారు. అసోసియేషన్ సభ్యులంతా ఏకగ్రీవంగా తీర్మానించినట్లు వెల్లడించారు. సిమెంట్ కంపెనీలు లారీల కిరాయిలను పెంచకపోవడంతో లారీల యజమానులు తీవ్ర నష్టపోతున్నామని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. లారీ కిరాయిలను పెంచే వరకు బంద్ కొనసాగీస్తామని స్పష్టం చేశారు. సరుకు రవాణా విషయంలో లోకల్ లారీలకు మొదటి ప్రాధాన్యత కల్పించాలని అన్నారు. ఈ డిమాండ్లకు కంపెనీలు అంగీకరించే వరకు బంద్ కొసాగుతుందన్నారు.
ఇదికూడా చదవండి...
https://www.dharshininews.com/29591/