schedule Friday, September 11, 2026

చిత్తశుద్ధిలేకుండా విజయోత్సవాలు..!

calendar_today December 2, 2024
person dharshininews
చిత్తశుద్ధిలేకుండా విజయోత్సవాలు..!
చిత్తశుద్ధిలేకుండా విజయోత్సవాలు..! - ముగ్గులు కాదు.. డబ్బాలు ఏర్పాటు చేయండి - మున్సిపల్ కౌన్సిలర్ సంగీత ఠాకూర్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ పరిధిలో కాంగ్రెస్ ప్రభుత్వ విజయోత్సవాలను చిత్తశుద్ధిలేకుండా నిర్వహిస్తున్నారని గాంధీనగర్ 20వ వార్డు కౌన్సిలర్ సంగీత అజయ్ సింగ్ ఠాకూర్ విమర్శించారు. సోమవారం తన వార్డులో ఏర్పాటు చేసిన విజయోత్సవాలలో ఒకే కార్మికుడుతో పారిశుద్ధ్య పనులు చేయించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. చైర్ పర్సన్ తన ఇంట్లో కార్మికులతో కొరత లేకుండా పనిచేయించుకుంటున్నారని ఆరో పించారు. పట్టణంలో పారిశుద్ధ్యం అధ్వాన్నంగా తయారందని అన్నారు. చైర్ పర్సన్, కమీషనర్లు బహిరంగ ప్రదేశాల్లో వేసిన ముగ్గుల వద్ద ఫోటోలకు ఫోజులు ఇవ్వడం తప్పా ఎలాంటి చిత్త శుద్దిని కనబరచడం లేదని ఎద్దేవా చేశారు. ముగ్గులు కాదు.. ప్రజలు చెత్త వేయకుండా డబ్బాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రజా పాలన వి జయోత్సవాలకు తాము వ్యతిరేకం కాదని, ప్రజా సమస్యలు పరిష్కరించడంలో చైర్ పర్సన్, కమీషనర్లు శ్రద్ధ చూపాలని అన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/31108/