schedule Monday, July 06, 2026

బీఆర్ఎస్‌ను ఇబ్బందులపాలు చేయడం ఎవరి తరం కాదు..!

calendar_today January 16, 2025
person dharshininews
బీఆర్ఎస్‌ను ఇబ్బందులపాలు చేయడం ఎవరి తరం కాదు..!
బీఆర్ఎస్‌ను ఇబ్బందులపాలు చేయడం ఎవరి తరం కాదు..! - వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై అక్రమ కేసులు దుర్మార్గం - కాంగ్రెస్, బీజేపీలకు తగిన గుణపాఠం తప్పదు - జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్ తాండూరు, దర్శని ప్రతినిధి : తెలంగాణలో ఉద్యమ పార్టీగా ఆవిర్భవించి.. పదేళ్లు సంక్షేమం, అభివృద్ధిని చేపట్టిన బీఆర్ఎస్ పార్టీని ఇబ్బందుల పాలు చేయడం ఎవరి తరం కాదని వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పై ఫార్మూలా ఈ రేసులో అక్రమ కేసులు నమోదు చేయడాన్ని ఖండించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, బీజేపీ కేంద్ర ప్రభుత్వం కుమ్మక్కై కేటీఆర్ పై కేసులు నమోదు చె యించారని ఆరోపించారు. గతంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో రెండు రోజులు తనిఖీలు చేపట్టి డాక్యుమెంట్లు, డబ్బులు, రికార్డులు దొరికినా ఈడీ ప్రవేశ పెట్టలేదని గుర్తుచేశారు. బీజేపీకి కాంగ్రెస్ వత్తాసు పలుకుతూ బీఆర్ఎస్ పార్టీని ఇబ్బందుల పాలు చేసేందుకు కుట్ర చేస్తుందని మండిపడ్డారు. ఇలాంటి ఎన్ని అస్త్రాలు ప్రయోగించినా బీఆర్ఎస్ పార్టీ తలవంచదు, తప్పు చేయదని అన్నారు. రానున్న రొ జుల్లో ఎన్ని దౌర్జన్యాలు, కుట్రలు చేసినా.. కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు ప్రజలు గుణపాఠం చెప్పక తప్పదన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఆరు గ్యారెంటీలను అమలు చేసి తీరాలని, లేదంటే ప్రజలే తిప్పికొట్టే రోజులు వస్తాయని హెచ్చరించారు. ఇది కూడా చదవండి.... https://www.dharshininews.com/32313/