schedule Monday, July 06, 2026

తాండూరు నుంచి శ్రీశైలం..!

calendar_today January 16, 2025
person dharshininews
తాండూరు నుంచి శ్రీశైలం..!
తాండూరు నుంచి శ్రీశైలం..! - శివ భక్తుల మహా పాదయాత్ర ప్రారంభం - భద్రేశ్వరుడు, ఆంజనేయ స్వామికి పూజలు - ఈ యేడాది కూడా కొనసాగిన సంప్రదాయం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం నుంచి శ్రీశైలం మహా క్షేత్రానికి శివభక్తుల పాదయాత్ర ప్రారంభమయ్యింది. శివరాత్రికి ముందు తాండూరు నుంచి శివ భక్తులు శ్రీశైలంకు పాదయాత్రగా వెళుతున్నారు. గత కొన్నేళ్లుగా కొనసాగిన సంప్రదాయాన్ని ఈ యేడాది కూడా కొనసాగించారు. శ్రీ ఉమా మహేశ్వర సేవా సమితి ఆధ్వర్యంలో గురువారం తాండూరు నుంచి శ్రీశైలం మహా పాదయాత్ర ప్రారంభమయ్యింది. సేవా సమితి సభ్యులు విద్యాసాగర్ గౌడ్, కౌన్సిలర్ పట్లోళ్ల నీరజాబాల్ రెడ్డిల ఆధ్వర్యంలో సుమారు 80 మంది భక్తులు పాదయాత్రగా బయల్దేరి వెళ్లారు. పాదయాద్ర సందర్బంగా గురువారం ఉదయం తాండూరు పట్టణంలోని భావిగి భద్రేశ్వర దేవాలయం వద్ద పూజలు నిర్వహించి పాదయాత్రను ప్రారంభించారు. ఈ పూజలో తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, పలువరు ప్రముఖులు పాల్గొన్నారు. అక్కడి నుంచి మార్గమద్యలోని రసూల్ పూర్‌ అభయాంజయనేయ స్వామి దేవాలయంలో కూడా పూజలు నిర్వహించి పాదయాత్రను కొనసాగించారు. ఈ సందర్బంగా పలువురు మాట్లాడుతూ శివయ్య ఆజ్ఞగా భావించి పాదయాత్రను చేపడుతున్నట్లు తెలిపారు. శివుని ఆశీస్సులు, కృప అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/32326/