schedule Monday, July 06, 2026

షబ్బాష్.. ఏజాజ్.. బాయ్..!

calendar_today February 18, 2025
person dharshininews
షబ్బాష్.. ఏజాజ్.. బాయ్..!
షబ్బాష్.. ఏజాజ్.. బాయ్..! - నీటి ఎద్దడి తీర్చిన యువనాయకుడు - 25వ వార్డులో సొంత ఖర్చులతో బోరు - కృతజ్ఞతలు తెలిపిన కాలనీ వాసులు తాండూరు, దర్శిని ప్రతినిధి : రాబోతున్న వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఓ యువనాయకుడు సొంత ఖర్చులతో కాలనీ వాసుల కోసం బోరు మోటారు వేయించి అందరి చేత షబ్బాష్‌.. అనిపించుకున్నారు. నీటి ఎద్దడిని తీర్చేందుకు కృషి చేయడం పట్ల కాలనీ వాసులు యువనాయకుడికి కృతజ్ఞతలు తెలిపారు. వివరాల్లోకి వెళితే... తాండూరు పట్టణం 25వ వార్డుకు చెందిన ఎజాజ్ అనే యువకుడు రియల్ ఏస్టేట్ వ్యాపారం చేస్తూ రాజకీయ పార్టీలో యువనాయకుడుగా కొనసాగుతున్నారు. మంగళవారం వార్డులో ప్రజల నీటి అవసరాల కోసం సొంతంగా వేలు ఖర్చు చేసి బోరు మోటారు వేయించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ కాలనీలో ఏండ్లుగా నీటి సమస్య ఉందని చెప్పుకొచ్చారు. నీటి అవసరాలు తీర్చుకోవాలంటే అవస్థలు పడాల్సి వచ్చేదని ఆవేధన వ్యక్తం చేశారు. కష్టాలను గుర్తించి ఎజాజ్ బోరు మోటారు వేయించడం అభినందనీయమని, అతనికి కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా యువనాయకుడు ఎజాజ్ మాట్లాడుతూ ప్రజా సేవలో భాగంగా తన వంతుగా బోరు మోటారు వేయించడం జరిగిందన్నారు. గతంలో ప్రజల కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. రానున్న రోజుల్లో కూడా ప్రజల కోసం తనవంతు బాధ్యతగా చేయూతను అందిస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు పెద్దలు, మహిళలు, యువకులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/33178/