schedule Monday, July 06, 2026

13న కామదహనం, 14 హోలీ

calendar_today March 11, 2025
person dharshininews
13న కామదహనం, 14 హోలీ
13న కామదహనం, 14 హోలీ - హిందూ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల నర్సింలు తాండూరు, దర్శిని ప్రతినిధి : హోలీ పర్వదిన వేడుకలపై తాండూరు హిందూ ఉత్సవ సమితి ప్రకటన చేసింది. ప్రతి యేడాది హోలీ పండగ వేడుకలను సంప్రదాయంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ యేడాది హోలీ పండగ సందర్భంగా నిర్వహించే కామ దహనం, హోలీ సంబరాలు జరుపుకునే నియమాలను హిందూ ఉత్సవ సమితి నిర్ణయించింది. ఇందులో భాగంగా రేపు 13న గురువారం రాత్రి 11-05 గంటల నుంచి అర్ధరాత్రి 12-30 గంటలలోపు కామ దహన వేడుకలు జరుపుకోవాలని హిందూ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల నర్సింలు తెలిపారు. అదేవిధంగా 14న శుక్రవారం హోలీ సంబరాలను జరుపుకోవాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. కావున ప్రజలు హోలీ పండగ = సంబరాలను సంప్రదాయంగా.. సంతోషంగా.. ప్రశాంతంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/33927/