schedule Thursday, September 10, 2026

అడవి జంతువుల కోసం ట్రాప్..!

calendar_today March 17, 2025
person dharshininews
అడవి జంతువుల కోసం ట్రాప్..!
అడవి జంతువుల కోసం ట్రాప్..! - తాండూరు మండలంలో కెమెరాలు ఏర్పాటు - ప్రత్యేక నిఘా ఉంచుతున్న అటవీ శాఖ అధికారులు తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తాండూరు మండలంలో సంచరిస్తున్న అడవి జంతువులను గుర్తించేందుకు స్థానిక అటవీ శాఖ అధికారులు ట్రాప్‌ కెమెరాల స్కెచ్ వేశారు. గత రెండు రోజుల క్రితం తాండూరు మండలం మల్కాపూర్ సమీపంలోని సిమెంట్ కర్మాగారం సమీపంలో పులిపిల్ల కనిపించినట్లు కార్మికులు అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు సోమవారం తాండూరు అటవీ శాఖ రేంజ్ ఆఫీసర్ శ్రీదేవి సరస్వతి ఆదేశాల మేరకు సెక్షన్ ఆఫీసర్ ఫిర్యానాయక్ ఆధ్వర్యంలో ట్రాఫ్ కెమెరాలను ఏర్పాటు చేశారు. తాండూరు మండలంలోని మల్కాపూర్ ఫ్యాక్టరీ సమీపంలో, సంగెంకలాన్ పరిసర ప్రాంతాల్లో మూడు ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. మూడు రోజుల పాటు కెమెరాలను ఏర్పాటు చేసి పులి పిల్ల, పులి కోసం నిఘా ఉంచుతామని తెలిపారు. ఒక వేళ పులి పిల్లలు, పులి కనిపిస్తే జాగ్రత్త చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అప్పటి వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో బీట్ ఆఫీసర్ మల్లయ్య ఉన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/34044/