schedule Saturday, September 12, 2026

గురుకులంలో జాబ్స్..!

calendar_today April 9, 2025
person dharshininews
గురుకులంలో జాబ్స్..!
గురుకులంలో జాబ్స్..! - ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం - అర్హతలు, గడువు ఎప్పటి వరకు అంటే..? తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లా తాండూరు మండలంలోని జినుగుర్తి గేటు సమీపంలో ఉన్న గిరిజన గురుకుల పాఠశాల, కళాశాలలో జాబ్స్‌ ఖాళీగా ఉన్నట్లు ప్రిన్సిపల్‌ నోటిఫికేషన్ జారీ చేశారు. ఖాళీ ఉద్యోగాల భర్తీకి అర్హులైన వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు ఒక ప్రకటనలో తెలి పారు. జూనియర్ అసిస్టెంట్ (డాటా ఎంట్రీ ఆపరేటర్) ఒక పోస్టు, ఆఫీస్ సబార్డినేట్ ఒక పోస్టు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. జూనియర్ అసిస్టెంట్ పోస్టుకు ఏదైన డిగ్రీతో పాటు కం ప్యూటర్ కోర్స్ పూర్తి చేసిన సర్టిఫికెట్ ఉండాల న్నారు. ఆఫీస్ సబార్డినేట్ పోస్టుకు పదో తరగ తి ఉత్తీర్ణత సాధించిన వారు దరఖాస్తు చేసుకో వాలని సూచించారు. ఈ నెల 15వ తేదీలోపు హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ మానస హి ల్స్ వద్ద ఉన్న గిరిజన గురుకుల ప్రధాన కార్యా లయంలో ఒరిజినల్ సర్టిఫికెట్లు, బయోడే టాతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు సెల్ : 7382931496కు సంప్రదించాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇదికూడా చదవండి.... https://www.dharshininews.com/34626/