schedule Monday, September 07, 2026

సేవామూర్తి రొంపల్లి సంతోష్ కుమార్

calendar_today July 27, 2022
person dharshininews
సేవామూర్తి రొంపల్లి సంతోష్ కుమార్
సేవామూర్తి రొంపల్లి సంతోష్ కుమార్ - పేదింటి మహిళకు కుట్టు మిషన్ వితరణ తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణానికి చెందిన ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు రొంపల్లి సంతోష్ కుమార్ సేవామూర్తిగా నిలిచారు. వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టే ఆయన తాజాగా ఓ పేదింటి మహిళకు కుట్టు మిషన్ ను అందజేసి సేవా ఔదర్యాన్ని చాటుకున్నారు. బుధవారం తాండూరు పట్టణం అయ్యప్ప నగర్‌కు చెందిన ఇంద్రమ్మ అనే మహిళకు వైశ్య ఫెడరేషన్ తరుపున సొంత ఖ‌ర్చుల‌తో కుట్టు మిషన్‌ను ఉచితంగా అందజేశారు. 'ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదరికంలో ఉన్న మహిళ స్వయం ఉపాధి పొందేందుకు చేయూతనందించడం జరిగిందన్నారు. సమాజంలో తనవంతు సేవా కార్యక్రమాలు చేపట్టడం తన అదృష్టమన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ముల్ పీఏసీఎస్ చైర్మన్ ద్యావరి విష్ణువర్ధన్ రెడ్డి, వైశ్య ఫెడరేషన్ కోశాధికారి ఆగీరు మహేష్. సభ్యులు ప్రమోద్ కుమార్. టీఆర్ఎస్ నాయకులు వీరప్రసాద్ తదితరులు ఉన్నారు.