schedule Friday, July 10, 2026

నవరాత్రి ఉత్సవాలకు ఆర్థిక చేయూత

calendar_today September 21, 2022
person dharshininews
నవరాత్రి ఉత్సవాలకు ఆర్థిక చేయూత
నవరాత్రి ఉత్సవాలకు ఆర్థిక చేయూత - రూ.30వేలు అందజేసిన మార్కెట్ కమిటి చైర్మన్ విఠల్ నాయక్ తాండూరు, దర్శిని ప్రతినిధి : దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుకునేందుకు తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ విఠల్ నాయక్ ఆర్థిక చేయూతనందించారు. పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో దసరా నవరాత్రి ఉత్సవాలను ఆనవాయితీగా జరుపుకుంటున్నారు. ఈ నవరాత్రి ఉత్సవాల కోసం బుధవారం తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ విఠల్ నాయక్ నిర్వహకులకు రూ. 30వేల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ విఠల్ నాయక్ మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది, కార్మికులు సునిల్, మల్లప్ప, ఆశప్ప, తులసీరాం, గోపాల్, ' వెంకట్, జాహంగీర్, వెంకటేష్, రవి తదితరులు ఉన్నారు.