schedule Sunday, July 05, 2026

ఘనంగా దీపావళి లక్ష్మీ పూజలు

calendar_today October 29, 2022
person dharshininews
ఘనంగా దీపావళి లక్ష్మీ పూజలు
ఘనంగా దీపావళి లక్ష్మీ పూజలు - పూజల్లో పాల్గొన్న భావనోళ్ల శంకర్ యాదవ్‌ - నేతలు, పట్టణ ప్రముఖుల సందడి తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణంలో దీపావళీ లక్ష్మీ పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రతి యేడాది దీపావళి సందర్భంగా దుకాణాలు, వ్యాపార సముదాయాలలో లక్ష్మీ పూజలు నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా ఈ సారి కూడ తాండూరులో లక్ష్మీపూజలు వైభవంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం రాత్రి తాండూరూరు పట్టణంలోని కూరగాయల మార్కెట్‌లో బి.నర్సింలుకు చెందిన కిరాణా మర్చంట్స్ దుకాణంలో లక్ష్మీపూజకు ప్రముఖ రియల్ ఏస్టేట్ వ్యాపారి, శ్రీ సాయిపుత్ర హోమ్స్ అండ్ డెవలపర్స్ అధినేత భావనోళ్ల శంకర్ యాదవ్ హాజరయ్యారు. ఆయనతో పాటు మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు, తాండూరు కన్వినర్ కందుకూరి రాజ్ కుమార్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్, సీనీయర్ నాయకులు బి. అనిల్ కుమార్, కోట్రిక నాగరాజు, జొన్నల వినోద్, వ్యాపారస్తులు పాల్గొన్నారు. నేతలు, వ్యాపారస్తుల, ప్రముఖుల రాకతో లక్ష్మీ పూజ సందడిగా మారింది.