schedule Friday, September 18, 2026

కాటేసిన కొండచిలువతో ఆసుపత్రికి వచ్చిన రైతు

calendar_today December 3, 2022
person dharshininews
కాటేసిన కొండచిలువతో ఆసుపత్రికి వచ్చిన రైతు
కాటేసిన కొండచిలువతో ఆసుపత్రికి వచ్చిన రైతు - మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌ తరలింపు - వికారాబాద్‌ జిల్లా యాలాల మండలంలో ఘటన తాండూరు, దర్శిని ప్రతినిధి: పొలం నుంచి వస్తుండగా తనను కొండచిలువ కాటేసిందని, దానిని సంచిలో తీసుకుని చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చాడు ఓ రైతు. శనివారం వెలుగులోకి వచ్చిన సంఘటన వికారాబాద్ జిల్లాలో కలకలం రేపింది. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలలంలోని పేర్కంపల్లి తాండాకు చెందిన రాములు నాయక్ శుక్రవారం సాయంత్రం తన పొలంలో పనులు ముగించుకుని ఇంటికి తిరిగి వస్తున్నాడు. మార్గమద్యలో మాటువేసిన కొండచిలువ ఒక్కసారిగా రాములు నాయక్‌పై దాడి చేసి కాటేసింది. వెంటనే రాములు నాయక్ కొండ చిలువను పట్టుకుని కుటుంబ సభ్యులతో కలిసి రాత్రి తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చాడు. పరీక్షించిన వైద్యులు ప్రాథమిక వైద్యం అందించి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌ రిఫర్ చేశారు. కుటుంబ సభ్యులు రాములు నాయక్ ను హైదరాబాద్‌ తరలించారు. ప్రస్తుతం రాములు నాయక్ హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్నాడు.