schedule Thursday, September 17, 2026

కాచేతల్లి బయలెల్లినాదో..!

calendar_today December 10, 2022
person dharshininews
కాచేతల్లి బయలెల్లినాదో..!
కాచేతల్లి బయలెల్లినాదో..! - గాజీపూర్‌లో ఘనంగా ఊరడమ్మ ఊరేగింపు - శోభాయామానంగా అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన తాండూరు, దర్శిని ప్రతినిధి: ఊరిని చల్లంగా కాచేతల్లీ బయలెల్లి వచ్చిందో అంటూ భక్తులు ఊరడమ్మ తల్లిని భక్తిశ్రద్దలతో కొలిచారు. శనివారం పెద్దేముల్ మండలం గాజీపూర్‌ గ్రామంలో ఊరడమ్మ విగ్రహా ప్రతిష్టాపన ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ప్రతిష్టాపన ఉత్సవాల సందర్భంగా ఊరడమ్మ విగ్రహాన్ని గ్రామ పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ఊరేగింపులో గ్రామపెద్దలు, భక్తులు అధిక సంఖ్యలలో ముందుకు సాగారు. డప్పు, డోలు వాయిద్యాలతో పాటు పోతురాజుల విన్యాసాలతో ఊరేగింపు కన్నుల పండుగగా సాగింది. వేద మంత్రోచ్చరణల మద్య అమ్మవారి విగ్రహా ప్రతిష్టాపన శోభాయామానంగా జరిగింది. విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలలో టీఆర్ఎస్‌ సీనీయర్ నాయకులు గాజీపూర్ నారాయణరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్ధ మాజీ చైర్మన్ మురళీకృష్ణ గౌడ్, ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర నాయకులు వెంకటేష్‌ చారి, గ్రామ పెద్దలు, యువకులు, భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి సల్లంగా దీవించు తల్లీ అంటూ ఊరడమ్మను వేడుకున్నారు. అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలతో గాజీపూర్‌లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.