schedule Friday, September 18, 2026

అంగన్ వాడి టీచర్లు ఆదర్శంగా నిలవాలి

calendar_today December 29, 2022
person dharshininews
అంగన్ వాడి టీచర్లు ఆదర్శంగా నిలవాలి
అంగన్ వాడి టీచర్లు ఆదర్శంగా నిలవాలి - టీచర్లను సన్మానించిన ఎంఐఎం కౌన్సిలర్ బొంబీనా తాండూరు, దర్శిని ప్రతినిధి: చిన్నారులకు, గర్భిణీ, బాలింతలకు అంగన్ వాడి టీచర్లు నిస్వార్థ సేవలందించి ఆదర్శంగా నిలవాలని తాండూరు మున్సిపల్ 14వ వార్డు ఎంఐఎం కౌన్సిలర్ బొంబీనా అన్నారు. పట్టణంలోని మాణిక్ నగర్ లోని అంగన్ వాడి కేంద్రంలో పనిచేస్తున్న వసంతమాల బదిలీపై వెళ్లగా ఆమె స్థానంలో జుంటుపల్లి స్వాతి నియామకం అయ్యారు. ఇందులో భాగంగా గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కౌన్సిలర్ బొంబీనా హాజరై బదిలీపై వెళుతున్న వసంతమాలకు వీడ్కోలు పలికి, కొత్తగా వచ్చిన జుంటుపల్లి స్వాతికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇద్దరు టీచర్లను సన్మానించారు. అనంతరం బొంబీనా మాట్లాడుతూ అంగన్ వాడి టీచర్లు అందించే సేవలు మరువలేని వన్నారు. ఎక్కడ పనిచేసిన నిస్వార్థంగా సేవలందిస్తారని అన్నారు. అందరికి అందుబాటులో సేవలందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్ వాడి టీచర్ సంద్యా గౌడ్, ఆయా, వార్డు మహిళలు, పెద్దలు తదితరులు పాల్గొన్నారు.