schedule Friday, September 18, 2026

ఉత్తమ ఎస్ఐ మహిపాల్ రెడ్డి

calendar_today January 26, 2023
person dharshininews
ఉత్తమ ఎస్ఐ మహిపాల్ రెడ్డి
ఉత్తమ ఎస్ఐ మహిపాల్ రెడ్డి - జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు - అభినందించిన పోలీసు శాఖ అధికారులు తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణ పోలీస్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ మహిపాల్ రెడ్డి ఉత్తమ ఎస్ఐగా నిలిచారు. వికారాబాద్‌ జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. గత కొన్ని రోజుల క్రితం తాండూరు పట్టణం మల్ రెడ్డిపల్లి చెరువులో తేలాడిన మృతదేహాన్ని ఎస్ఐ మహిపాల్ రెడ్డి చెరువులో దిగి బయటకు తీశారు. పదవి విరమణకు చేరువలో ఉన్న ఆయన ఈ సంఘటనతో అందరి దృష్టిని ఆకర్షించడంతో పాటు అధికారుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. అయితే గురువారం వికారాబాద్‌ జిల్లా కేంద్రంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకలలో అధికారులకు ఉత్తమ అవార్డులను అందజేశారు. ఇందులో తాండూరు ఎస్ఐ మహిపాల్ రెడ్డి జిల్లా కలెక్టర్ కె.నిఖిల చేతుల మీదుగా ఉత్తమ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవ వేడుకలలో జిల్లా కలెక్టర్, అడిషనల్ ఎస్పీ, జిల్లా ఉన్నతాధికారుల సమక్షంలో ఉత్తమ అవార్డును అందుకోవడంపై సంతోషం వ్యక్తం చేశారు. మరోవైపు తాండూరు పోలీసు శాఖ అధికారులు ఎస్ఐ మహిపాల్‌ రెడ్డికి అభినందనలు తెలిపారు.