schedule Saturday, July 04, 2026

ఆకట్టుకున్న నక్షత్ర నృత్యం

calendar_today January 29, 2023
person dharshininews
ఆకట్టుకున్న నక్షత్ర నృత్యం
ఆకట్టుకున్న నక్షత్ర నృత్యం - శిల్పారామం వేదికలో అవార్డు - అభినందించిన తాండూరు ప్రజలు తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరుకు చెందిన విద్యార్థి నక్షత్ర నృత్యాభినయం ఆకట్టుకుంది. ఆమె నృత్య ప్రదర్శనకు అవార్డును అందజేశారు. దీంతో కుటుంబ సభ్యులతో పాటు పలువురు అభినందించారు. వివరాల్లోకి వెళితే తాండూరు మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న వేణు కూతురు నక్షత్ర హైదరాబాద్‌ నగరంలోని శిల్పారామంలో శనివారం రాత్రి శిల్పారామం ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. ఈ ప్రదర్శనలో నక్షత్ర చేసిన నృత్యం అందరిని ఆకట్టుకుంది. దీంతో నిర్వహకులు ఆమెకు ఉత్తమ ప్రదర్శన అవార్డును అందజేశారు. ఈ కార్యక్రమంలో తండ్రి వేణు, డ్యాన్స్ మాస్టర్ వెంకటేశ్వర్లు ఉన్నారు. మరోవైపు మున్సిపల్‌ పనిచేసే వేణు కూతురును మేనేజర్ నరేందర్ రెడ్డి, ఇతర సిబ్బంది అభినందించారు.