schedule Sunday, September 20, 2026

జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డితో రాజు గౌడ్ భేటి

calendar_today February 21, 2023
person dharshininews
జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డితో రాజు గౌడ్ భేటి
జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డితో రాజు గౌడ్ భేటి - శుభాకాంక్షలు తెలిపిన గ్రంథాలయ చైర్మన్ తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డితో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్ భేటి అయ్యారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ నారాయణ రెడ్డిని రాజుగౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా పుష్పగుచ్చం అందించి శుభకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి వచ్చి రావడంతోనే జిల్లా పరిపాలనలో తమదైన ముద్ర వేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ప్రజల సమస్యల పరిష్కారానికి చొరవ చూపడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. జిల్లా గ్రంథాలయాల అభివృద్ధికి తోడ్పాటు అందించాలని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డిని కోరారు. ఇందుకు జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించినట్లు రాజుగౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ తాండూరు నియోజకవర్గ అధికారం ప్రతినిధి వెంకట్ రెడ్డి, పట్టణ ఉపాధ్యక్షులు హరిహర గౌడ్ ఉన్నారు.