schedule Saturday, July 04, 2026

గోనూరులో ఇసుక ట్రాక్టర్ పట్టివేత

calendar_today March 31, 2023
person dharshininews
గోనూరులో ఇసుక ట్రాక్టర్ పట్టివేత
గోనూరులో ఇసుక ట్రాక్టర్ పట్టివేత - కేసు నమోదు చేసిన కరణ్‌ కోట్ పోలీసులు తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి: ఆక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ను కరణ్ కోట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. కరణ్‌ కోట్ ఎస్ఐ మధుసూధన్‌ రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తాండూరు మండలం గోనూర్ గ్రామంలో గత కొన్ని రోజుల మంచి జోరుగా అక్రమ ఇసుక రవాణా కొనసాగుతోంది. అక్రమ రావణను నియంత్రించాలని రెవెన్యూ, పోలీసు అధికారులకు ఫిర్యాదులు చేసినట్లు గ్రామస్తులు గుర్తుచేస్తున్నారు. ఈ మేరకు దృష్టిసారించిన కరణ్‌ కోట్ పోలీసులు శుక్రవారం గ్రామ సమీపంలో నుంచి ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ ను అదుపులోకి తీసుకున్నారు. ఇసుక రవాణాకు సంబంధించి ఎలాంటి అనుమతి పత్రాలు లేకపోవడంతో ట్రాక్టర్ను పోలీస్ స్టేషన్ కు తరలించారు. పట్టుబడిన ట్రాక్టర్ గ్రామానికి చెందిన అనంత్‌ రెడ్డిదిగా గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ మధుసూధన్ రెడ్డి తెలిపారు. ఎవరైనా అనుమతులు లేకుండా ఇసుక రవాణాకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.