schedule Sunday, July 05, 2026

నేషనల్ అవార్డు పొందడం అభినందనీయం

calendar_today April 17, 2023
person dharshininews
నేషనల్ అవార్డు పొందడం అభినందనీయం
నేషనల్ అవార్డు పొందడం అభినందనీయం - గౌతాపూర్ సర్పంచ్ రాజప్పగౌడ్‌కు సన్మానం - నిజామాబాద్ ఏ ఎస్పీ సమక్షంలో నిర్వహణ తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు మండలం గౌతాపూర్ గ్రామ పంచాయతీకి నేషనల్ అవార్డు రావడం, ఇందుకు కృషి చేసిన సర్పంచ్ రాజప్ప గౌడ్ సేవలు అభినందనీయమని నిజామాబాద్ ఏఎస్సీ మధుసూదన్ రావు, బీపీ సంక్షేమ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ లు అన్నారు. గౌతాపూర్ గ్రామ పంచాయతికి మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో జాతీయ అవార్డు రావడం పట్ల బీసీ సంఘం ఆధ్వర్యంలో సర్పంచ్ రాజప్ప గౌడ్ కు సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజ రైన నిజామాబాద్ ఏఎస్పీ మధుసూధన్ రావు, బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు, తాండూరు కన్వినర్ కందుకూరి రాజ్ కుమార్లు పూలమాల వేసి శాలువాతో రాజప్ప గౌడ్ను సన్మానించారు. నేషనల్ అవార్డు సాధించేలా పంచాయతీని ఆదర్శంగా తీర్చిదిద్దడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో స్పెస్ మనోహర్ యాదవ్, గడ్డం వెంకటేష్, హరిగౌడ్, రాము ముదిరాజ్, జుంటుపల్లి వెంకట్, శివ, పరమేష్, పాయి, ఇందూరు వెంకట్, బస్వరాజ్, అజిత్ ఠాకూర్, ఎస్. వెంకట్, నర్సింహా, భాస్కర్, హరిప్రసాద్, శ్రీశైలం గౌడ్, అంజిలప్ప, కృష్ణ, నరేష్ తదితరులు పాల్గొన్నారు.