schedule Monday, July 06, 2026

గాలి వాన భీభత్సం..!

calendar_today May 9, 2023
person dharshininews
గాలి వాన భీభత్సం..!
గాలి వాన భీభత్సం..! - కొత్లాపూర్లో నేలకొరిగిన విద్యుత్ స్థంబాలు, చెట్లు - అంతరాయంతో గ్రామస్తులు ఇబ్బందులు తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తాండూరు మండలంలో గాలి వాన భీభత్సం సృష్టించింది. మంగళవారం సాయంత్రం తాండూరు మండలంలో గాలితో పాటు వడగండ్ల వర్షం ప్రారంభయ్యింది. గాలి దాటికి మండలంలోని కొత్లాపూర్ గ్రామంలో విద్యుత్ స్థంబాలు, చెట్లు నేలకొరిగాయి. గాలి వాన బీభత్సంతో గ్రామంలో విద్యుత్ అంతరాయం, చెట్లు నేలకొరగడంతో రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. ఈ విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ బుడ్డెళ్లి సాయిలు సంఘటనా స్థలాలను పరిశీలించారు. విద్యుత్ అధికారులతో పాటు సంబంధిత అధికారులకు సమాచారం అందించారు. గ్రామంలో విద్యుత్ అంతరాయంతో పాటు నేలకొరిగిన చెట్లను తొలగించి.. ఇబ్బందులను పరిష్కరించాలని కోరారు. మరోవైపు మండలంలో కురిసిన భారీ వర్షంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు.