schedule Monday, July 06, 2026

కాంగ్రెస్ దూకుడు ఆగదు..!

calendar_today May 13, 2023
person dharshininews
కాంగ్రెస్ దూకుడు ఆగదు..!
కాంగ్రెస్ దూకుడు ఆగదు..! - తెలంగాణలో కూడా జెండా ఎగరేస్తాం - తాండూరు పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్ తాండూరు, దర్శిని ప్రతినిధి : కర్ణాటక ఎన్నికల్లో ప్రారంభమైన కాంగ్రెస్ గెలుపు దూకుడు ఆగదని, తెలంగాణలో కూడా కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని ఆ పార్టీ తాండూరు పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్ అన్నారు. శనివారం కర్ణాటక రాష్ట్రంలో జరిగిన ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ గెలుపుపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇన్నేళ్లు పాలించిన బీజేపీ సామాన్య ప్రజలకు అన్యాయం చేసిందన్నారు. బీజేపీ అవినీతి, మత రాజకీయాల కుట్రను తిప్పి కొట్టేందుకు కన్నడ నాట ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని అన్నారు. కర్ణాటకలో జరిగిన గెలుపు పరంపర తెలంగాణలో కూడా కొనసాగుతుందన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమన్నారు. కర్ణాటక కాంగ్రెస్ గెలుపుతో రేవంత్ రెడ్డి నాయకత్వంలో పార్టీ గెలుపుకు కృషి చేస్తామన్నారు. మరోవైపు కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపుకు కారణమైన కన్నడ, తెలుగు ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఇది కూడా చదవండి... హాఫ్ షర్ట్, టీ షర్టుతో బైకు నడిపితే..! - వాహనదారులకు ట్రాఫిక్ చలాన్లు - కేంద్ర ప్రభుత్వం ఏం చెబుతుందంటే..? https://dharshininews.com/17144