schedule Monday, July 06, 2026

పల్లెలు, తాండాలకు మహర్ధశ

calendar_today May 14, 2023
person dharshininews
పల్లెలు, తాండాలకు మహర్ధశ
పల్లెలు, తాండాలకు మహర్ధశ - రూ.50 లక్షల నిధులతో అభివృద్ధి - తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి - ప్రోసిడింగ్ కాపీలు అందజేసిన ఎమ్మెల్యే తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గంలోని ప్రతి పల్లె, తాండాలకు మహర్ధశ తీసుకవస్తున్నామని స్థానిక ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. ఆదివారం తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రతి గ్రామానికి, తాండాకు రూ.50 లక్షల నిధుల మంజూరుకు సంబంధించిన ప్రొసిడింగ్ కాపీలను ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తన చేతులు మీదుగా గ్రామాల, తాండాల ప్రతినిధులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సహాకారంతో తాండూరు నియోజకవర్గానికి రూ.134 కోట్లు సాధించుకరావడం జరిగిందన్నారు. పల్లె పల్లెకు పైలెట్ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు, తాండాలకు రూ. 50 లక్షల విధులు. మంజూరు చేస్తామని హామి ఇచ్చినట్లు గుర్తుచేశారు. ఇచ్చిన హామీ మేరకు దాదాపు 1200లకు పైగా ప్రోసిడింగ్ కాపీలను అందజేయడం జరిగిందన్నారు. రూ.50 లక్షల నిధులతో అభివృద్ధి పనులు పూర్తి చేయించి పల్లెలు, తాండాలకు మహర్దశ పట్టించడం జరుగుతుందన్నారు. దీంతో పల్లెలు, తాండాల రూపురేఖలు మారడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ విఠల్ నాయక్, పెద్దేముల్, యాలాల, కోట్ పల్లి మండలాల ప్రజా ప్రతినిధులు, నాయకులు ఉన్నారు. ఇది కూడా చదవండి... హాఫ్ షర్ట్, టీ షర్టుతో బైకు నడిపితే..! - వాహనదారులకు ట్రాఫిక్ చలాన్లు - కేంద్ర ప్రభుత్వం ఏం చెబుతుందంటే..? https://dharshininews.com/17144