schedule Monday, September 21, 2026

దొంగతనంగా ఇసుక రవాణా

calendar_today May 16, 2023
person dharshininews
దొంగతనంగా ఇసుక రవాణా
దొంగతనంగా ఇసుక రవాణా - ట్రాక్టర్‌ను పట్టుకున్న కరణ్‌ కోట్ పోలీసులు - డ్రైవర్‌పై కేసు నమోదు : ఎస్ఐ మధుసూధన్ రెడ్డి తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : దొంగతనంగా ఇసుక రవాణా చేపడుతున్న విధానానికి కరణ్‌ కోట్ పోలీసులు చెక్‌ పెట్టారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ ను పోలీసులు పట్టుకున్నారు. ఎస్ఐ మధు సూధన్ రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తాండూరు మండలం గోనూర్ గ్రామంలోని కాగ్నా వాగు నుంచి ఇసుక అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ (బీఆర్ నెం. టీఎస్ 34 జీ 3995, ట్రాలీ నెం. ఏపీ 21. ఎక్స్ 4744) ను పోలీసులు పట్టుకున్నారు. తరలింపుకు సంబంధించి ఎలాంటి పత్రాలు, అనుమతులు లేకపోవడంతో ట్రాక్టర్ ను పోలీస్టేషన్ కు తరలించారు. ట్రాక్టర్. డ్రైవర్ అదే గ్రామానికి చెందిన కట్టెల సురేష్ పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ మధుసూధన్ రెడ్డి తెలిపారు. ఇది కూడా చదవండి... పట్టణ రహదారులకు రాజయోగం - తాండూరు రోడ్ల అభివృద్ధికి రూ. 25 కోట్లు - జీఓ 217ను జారీ చేసిన ఆర్అండ్‌బీ - ఫలించిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కృషి https://dharshininews.com/17221