schedule Tuesday, September 22, 2026

అంత్యక్రియలకు ఆర్థిక సాయం

calendar_today May 16, 2023
person dharshininews
అంత్యక్రియలకు ఆర్థిక సాయం
అంత్యక్రియలకు ఆర్థిక సాయం - రూ. 4వేలు అందించిన చంద్రశేఖర్ గౌడ్ తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : చికిత్స పొందుతూ మృతి చెందిన వ్యక్తి అంత్యక్రియలకు తాండూరు బీఆర్ఎస్ నాయకులు ఆర్థిక సహాయం అందజేశారు. వివరాల్లోకి వెళితే... తాండూరు మండలము మల్కాపూర్ గ్రామానికి చెందిన దుద్యాల శాంతప్ప ఏకైక కుమారుడు దుద్యాల శివకుమార్ నాలుగు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. కోమాలోకి వెళ్లి మృత్యువుతో పోరాడి శివకుమార్ కన్నుమూశారు. మంగళవారం గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. తాండూరు మండల బీఆర్ఎస్ మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ హసన్ పటేల్ ద్వారా విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ బీసీ సెల్ మండల అధ్యక్షులు చంద్రశేఖర్ గౌడ్ కుటుంబాన్ని పరామర్శించారు. శివకుమార్ అంత్యక్రియల కోసం చంద్రశేఖర్ గౌడ్ తన సొంత ఖర్చుల నుంచి రూ. 4 వేలు శాంతప్పకు ఆర్థిక సాయంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో తుల్జప్ప, రుద్రప్ప, కార్తిక్, హన్మంతు, మాల గుండప్ప, ఎం. నర్సింలు తదితరులు ఉన్నారు. ఇది కూడా చదవండి... పట్టణ రహదారులకు రాజయోగం - తాండూరు రోడ్ల అభివృద్ధికి రూ. 25 కోట్లు - జీఓ 217ను జారీ చేసిన ఆర్అండ్‌బీ - ఫలించిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కృషి https://dharshininews.com/17221