schedule Tuesday, September 22, 2026

తాండూరుకు పీఆర్ ఈఈ, క్వాలిటీ కంట్రోల్ కార్యాలయాలు

calendar_today May 24, 2023
person dharshininews
తాండూరుకు పీఆర్ ఈఈ, క్వాలిటీ కంట్రోల్ కార్యాలయాలు
తాండూరుకు పీఆర్ ఈఈ, క్వాలిటీ కంట్రోల్ కార్యాలయాలు - వికారాబాద్ కు పీఆర్ ఎస్ఈ కార్యాలయం - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం - ఫలించిన సునీతామహేందర్ రెడ్డి ప్రయత్నం - సీఎం కేసీఆర్, పీఆర్ మంత్రికి జడ్పి చైర్ పర్సన్ కృతజ్ఞతలు తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా:తాండూరు నియోజకవర్గానికి పంచాయతీరాజ్ ముఖ్య కార్యాలయాలు మంజూరు అయినట్లు జడ్పి చైర్ పర్సన్ పట్నం సునీతామహేందర్ రెడ్డి గారు తెలిపారు. వికారాబాద్ తో పాటు అదనంగా పంచాయతీ రాజ్ శాఖ ఈఈ, క్వాలిటీ కంట్రోల్ డిప్యూటీ ఈఈ కార్యాలయాలు తాండూరుకు వచ్చాయన్నారు. అలాగే ఇప్పటివరకు హైదరాబాద్ లో ఉన్న పీఆర్ ఎస్ఈ కార్యాలయం వికారాబాద్ కు తరలిస్తూ మంగళవారం ప్రభుత్వం జీఓ నంబర్ 18, 19ని జారీ చేసిందని సునీతారెడ్డి తెలిపారు. తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ పరిపాలన సౌలభ్యం కోసం పంచాయతీ రాజ్ లో పునర్వ్యవస్థీకరణ చేశారన్నారు. గత పదేళ్లుగా ఈ కార్యాలయాలు మంజూరు కోసం ప్రభుత్వానికి వినతులు ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు. కొత్త కార్యాలయాలతో తాండూరుతో పాటు కొడంగల్ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు వేగంగా పూర్తవవుతాయని, అలాగే సర్పంచులు, ఎంపీటీసీ లకు, కాంట్రాక్టులకు ఈఈ కోసం వికారాబాద్ వెళ్లే అవసరం లేదన్నారు. ఈ సందర్భంగా గౌరవ సీఎం కేసీఆర్ గారికి, పీఆర్ మినిస్టర్ ఎర్రబెల్లి దయాకర్ రావు గారికి జడ్పి చైర్ పర్సన్ పట్నం సునీతా మహేందర్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. త్వరలో ఈ కార్యాలయాలు ప్రారంభిస్తామని సునీతా రెడ్డి వెల్లడించారు. chaithany collage