schedule Monday, July 06, 2026

విద్యాసాగర్ గౌడ్ కు నంది అవార్డు

calendar_today May 26, 2023
person dharshininews
విద్యాసాగర్ గౌడ్ కు నంది అవార్డు
విద్యాసాగర్ గౌడ్ కు నంది అవార్డు - హిందూ ధర్మపరిరక్షణ సేవా సారథి పురస్కారం - ఉప్పల శ్రీనివాస్ గుప్త చేతుల మీదుగా అందజేత తాండూరు, దర్శిని ప్రతినిధి : బీఆర్ఎస్ నాయకులు, తాండూరు సెలబ్రిటి ఎల్. విద్యా సాగర్ గౌడ్ నంది అవార్డుతో పాటు ఉత్తమ సేవా పురస్కారాన్ని అందుకున్నారు. హైదరాబాద్ కు చెందిన శ్రీ త్రినయన సాంస్కృతిక కళానియం సాంస్కృతిక సేవా సంస్థ శోభకృత్‌నామ సంవత్సరం ఉగాదిను పురస్కరించుకుని పలు ధపాలుగా ఉత్తమ పురస్కారాలు, నంది అవార్డులను అందజేస్తోంది. ఇందులో భాగంగా శుక్రవారం హైదరాబాద్‌లోని సంస్థ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో తెలంగాణ రాష్ట్ర టూరిజం కార్పోరేషన్ మాజీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త, తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ కార్పోరేషన్ చైర్మన్ వేణుగోపాల చారి చేతుల మీదుగా విద్యా సాగర్ గౌడ్ హిందూ ధర్మ పరిరక్షణ సేవా సారథి పురస్కారంతో పాటు ఉగాది నంది పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా విద్యాసాగర్ గౌడ్ మాట్లాడుతూ ధర్మ పరిరక్షణలో తన వంతు సేవలు, సామాజిక సేవలను గుర్తించి నంది అవార్డు, సేవా పురస్కారం అందించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. మరోవైపు తాండూరుకు చెందిన నేతలు, అభిమానులు విద్యాసాగర్ గౌడ్ కు శుభాకాంక్షలు తెలిపారు.
ఇది కూడ చదవండి... 'ముచ్చట'యిన భేటీ..! - ఆసక్తికరంగా ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే కలయిక - ఇరువర్గాలలో జోరుగా చర్చలు - రాజకీయ పరిణాలపై మాటామంతి https://dharshininews.com/17369
chaithany collage