schedule Monday, July 06, 2026

వీరన్న స్వామిగా శివుడు...!

calendar_today May 29, 2023
person dharshininews
వీరన్న స్వామిగా శివుడు...!
వీరన్న స్వామిగా శివుడు...! - భద్రేశ్వర దేవాలయంలో భక్తుల పూజలు - ఆలయ పూజారి ప్రత్యేక అలంకరణ తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణ నడిబొడ్డున వెలసిన శ్రీ బావిగి భద్రేశ్వర దేవాలయంలోని శివుడు వీరన్న స్వామిగా దర్శనమిచ్చారు. సోమవారంను పురస్కరించుకుని ఆలయ పూజారి విజయ్ కుమార్ స్వామి ఆలయంలో వెలసిన శివునికి ప్రత్యేక అలంకరణ చేశారు. నారాయణ పేట్ జిల్లా గుండెపల్లి గ్రామంలో వెలసిన శ్రీ వీరన్న స్వామిగా శివున్ని ముస్తాబు చేశారు. ప్రత్యేక అలంకరణలో దర్శన మిచ్చిన్న శివున్ని భక్తులు కనులారా దర్శించుకుని పూజించారు. సల్లంగా దీవించు శివయ్యా అంటూ వేడుకున్నారు. ఇది కూడా చదవండి... రేషన్‌కు హెల్ప్‌ లైన్..! - మీ కోటా ఇవ్వకుంటే కంప్లైట్ చేయొచ్చు - తూకంలో మోసాలపై ఫిర్యాదుకు అవకాశం https://dharshininews.com/17434 chaithany collage