schedule Monday, September 21, 2026

సోనియాగాంధీకి పాలాభిషేకం

calendar_today June 2, 2023
person dharshininews
సోనియాగాంధీకి పాలాభిషేకం
సోనియాగాంధీకి పాలాభిషేకం - నేతలతో కలిసి చేసిన రమేష్‌ మహరాజ్ - కాంగ్రెస్ ఆధ్వర్యంలో తెలంగాణ సంబరాలు తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ సంబరాలను ఘనంగా జరుకున్నారు. పార్టీ పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్ ఆధ్వర్యంలో కార్యాలయ ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించి వందనం సమర్పించారు. అనంతరం టీపీపీసీ ఉపాధ్యక్షులు ఎం. రమేష్ మహారాజ్ చేతుల మీదుగా తెలంగాణ రాష్ట్రా న్ని ప్రకటించిన కాంగ్రెస్ అధినేత సోనియాగాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. నేతలు, కార్యకర్తలు సోనియా గాంధీ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. కాంగ్రెస్ పార్టీతోనే తెలంగాణ ప్రజల ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష నెరవేరిందని ఆ పార్టీ నేతలు గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి... త్వరలో నా పెళ్లి..! - నేను జైలుకు వెళ్లనంటే వెళ్లను - కోర్టులో రిమాండ్‌ ఖైదీ హంగామా - కోర్టులోనే తలుపు అద్దాలు ధ్వసం https://dharshininews.com/17509

chaithany collage