schedule Monday, July 06, 2026

ఇందిరానగర్‌లో తాగునీటి ఇబ్బంది

calendar_today June 6, 2023
person dharshininews
ఇందిరానగర్‌లో తాగునీటి ఇబ్బంది
ఇందిరానగర్‌లో తాగునీటి ఇబ్బంది - ట్యాంకర్ తెప్పించిన కౌన్సిలర్ బోయ రవి తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు మున్సిపల్ పరిధి ఇందిరానగర్‌ 6 వార్డులో తాగునీటి ఎద్దడి ఏర్పడింది. కాలనీలో తాగునీటికి సంబంధించిన ఫాత పైపులైన్ మరమ్మత్తులకు గురికావడంతో నీటి సరఫరా స్థంభించింది. తాగునీరు లేక వార్డు ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న వార్డు కౌన్సిలర్ బోయ రవి అధికారులకు సమాచారం అందించారు. వెంటనే మున్సిపల్ ట్యాంకర్‌ను రప్పించి కాలనీ వాసులకు తాగునీటిని సరఫరా చేయించారు. ఈ సందర్బంగా కౌన్సిలర్ మాట్లాడుతూ మరమ్మత్తులకు గురైన పైపులైన్‌కు మరమ్మత్తులు చేయించడంతో పాటు కొత్త పైపులైన్ అందుబాటులోకి తీసుకవచ్చేలా కృషి చేస్తానని పేర్కొన్నారు. మరోవైపు తాగునీటి సమస్యను తీర్చడం పట్ల కాలనీ మహిళలు కౌన్సిలర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/17614 chaithany collage