schedule Tuesday, September 22, 2026

ప్రగతి సారథి పైలెట్‌..!

calendar_today June 7, 2023
person dharshininews
ప్రగతి సారథి పైలెట్‌..!
ప్రగతి సారథి పైలెట్‌..! - కౌన్సిలర్ వరాల శ్రీనివాస్ రెడ్డి - గ్రీన్‌ సిటీలో ఎమ్మెల్యే జన్మదినం తాండూరు, దర్శిని ప్రతినిధి: అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతున్న తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ప్రగతి సారథిగా నిలుస్తున్నారని 13వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ వరాల శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని గ్రీన్‌ సిటీలో వరాల శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో పైలెట్ రోహిత్ రెడ్డి జన్మదిన వేడుకలను నిర్వహించారు. పార్టీ నాయకులు, ఎమ్మెల్యే అభిమానుల మధ్య వరాల శ్రీనివాస్ రెడ్డి కేక్‌ కట్ చేసి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రోహిత్ రెడ్డి జిందాబాద్‌ అంటూ నినాదాలు చేశారు. తాండూరు నియోజకవర్గ అభివృద్ధి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డితో సాధ్యమవుతుందని, మళ్లీ రోహిత్ రెడ్డి ఎన్నికల్లో గెలిచి మంత్రిగా సేవలందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వార్డు నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. chaithany collage